

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పట్టణములోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు,డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులర్పింటము జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ తరువాత బాబూజీగా భారతదేశం లో పిలవబడ్డారని నాయకులు కొనియడారు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటులో వ్యవసాయ,కార్మిక శాఖలతోపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా పని చేశారని అన్నారు. 1935లో బలహీనవర్గాల వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారన్నారు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారూ, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారన్నారు.ఈ దేశం, రాష్ట్రలో ఉన్న అణగారిన వర్గాల వారి కోసం కృషి చేసిన ఘనత ఆయన దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బి.శ్రీను నాయక్, కౌన్సిలర్ కోటా నాయక్,కొండ్రముట్ల నాగేశ్వరరావు, సలికినీడి నాగరాజు ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు, పుట్టా వెంకట బుల్లోడు,ఇస్లావతు మంగ నాయక్ ప్రత్తిపాటి చిన్న,కె.నాగ రాజు, సి.హెచ్ హరిప్రసాద్,బి.వెంకటేశ్ నాయక్, నేలం యేసు రాజు,యన్. బద్ధు నాయక్ ,కె.రంగయ్య,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.