

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర
జగన్ న్యూస్ ఏప్రిల్ 5 సంగారెడ్డి జిల్లా
పటాన్ చేరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి గుంతలు పడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సిపిఎం పార్టీ పటాన్ చేరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఐనోలు నుండి పటాన్ చేరు అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పటాన్ చేరు ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి లు మాట్లాడుతూ గుంతలు పడ్డ రోడ్డుకు చేయాలని డిమాండ్ చేశారు. గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు అని అన్నారు. అందుకోసం ఈ రోడ్డును వెంటనే నాలుగు లైన్ల రోడ్డుగా వెడల్పు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంద్రేశం ప్రాంతం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఈ ప్రాంతంలో సాయి, సిటిజెన్, మహదేవపురం, రాయల్, పిఎన్ఆర్ టౌన్షిప్, నవ్య, వీకర్, జిహెచ్ఎంసి ఇంద్రపురి , జర్నలిస్టు మరియు ఇతర కాలనీలు ఏర్పడి వేలాదిమంది ప్రజలు నివసిస్తున్నారు అని అన్నారు. లక్షల రూపాయల్లో టాక్స్లు చెల్లిస్తున్నారు అని అన్నారు. ఈ రోడ్డు గుండా బచ్చు గూడెం, రామేశ్వరం బండ, కొడకంచి ,జిన్నారం, ఐ నో లు, పెద్ద, చిన్న కంజర్ల, శివానగర్ ఇతర గ్రామాలకు లక్షల సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేస్తుంటారని అన్నారు, జిల్లా అధికార యంత్రాంగం మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నదని అన్నారు. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మత్తుల కోసం ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపినామని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్న నేటికీ ఆచరణ కరువైందని అన్నారు. ముత్తంగి రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు నుండి పెద్ద కంజర్ల శివానగర్ చౌరస్తా వరకు హెచ్ఎండిఏ వారు 20 కోట్ల రూపాయలతో 2021 సంవత్సరంలో ప్రతిపాదనలు పంపి, ప్రజా ప్రతినిధుల అలసత్వంతో,మంజూరు చేసిన పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందని అన్నారు. ఈ రోడ్డు పనుల నిర్మాణం పైన స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు, రోడ్డు విస్తరణ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, మెమోరండాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఈ ప్రాంత ప్రజలను కలుపుకొని ఉదృతం చేస్తామని జిల్లా అధికార యంత్రం గాని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎండి వాజీ దళి, జార్జి,వెంకట్రాంరెడ్డి, వీరస్వామి,వెంకట్ దాసు, బలరాం,చంద్ర కిరణ్ సింగ్, జార్జ్, యాక రామచంద్ర మూర్తి, రాములు, మహిళలు ఇతరులు పాల్గొన్నారు.