Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షాపుల్లర్స్ కాలనీలో మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించిన డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ జగ్జీవన్ రావు పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త రాజకీయవేత్త అని బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చి అతను బాబూజీగా ప్రసిద్ధుడయ్యాడని భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించారనీ 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడనీ ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడనీ తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్లోని బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర రావు మాచర్ల భద్రయ్య, ఆంజనేయులు, బాబు, యశ్వంత్, ప్రవీణ్, విక్రం, బాబు, మురళి, రాజేందర్, రామచందర్, బాబురావు, సోమయ్య, కె.వి. రావు, జై, కిరణ్, వెంకట్, రాములు, రాజు, రవీందర్, హరీష్, వినయ్, నవీన్, రవి, వెంకటేష్, మురళి, శానప్ప, మోహన్ చారి, రామ్మూర్తి, మాధవి రెడ్డి, శైలజ, అనురాధ, రాధిక, తదితరులు పాల్గొన్నారు.