Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 5, వికారాబాద్ జిల్లా

పరిగి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన నేత, బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఆదర్శ నేత, బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సురేందర్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, భాస్కర్, మాజీ కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.