Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ (5) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య పూలమాలవేసి నివాళులర్పించినాడు. జగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త అని అన్నాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ గోపగాని రమేష్, కొండగడుపుల వెంకటేష్, సాయి కిరణ్,మల్లేష్,వెంకన్న, శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.