


రామగుండం కమీషనరేట్ లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 118వ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 6,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం 118వ జయంతి వేడుకలు రామగుండము పోలీస్ కమీషనరేటులో ఘనంగా జరిగాయి. రామగుండము పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా బాబూ జగ్జీవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ …. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ… స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని అన్నారు. జగ్జీవన్రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. దేశ రక్షణ మంత్రిగా బాబూ జగ్జీవన్ రాం వేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయని అన్నారు. మనం అందరం కలిసి పని చేసి సమాజం ,రాష్ట్రం అబివృద్ది ఉంటుందని మహనీయుల ఆశయాలను మనమందరం ముందుకు తీసుకపోవాలని, ముఖ్యంగా యూనిఫాం సర్వీస్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం జరిగినది అందరిని యుద్ధంలో భారత రక్షణ కోసం భాగస్వాములను చేశారు. ముఖ్యంగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు.ఈ కార్యక్రమం లో స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు ,ఎ ఆర్ ఎసిపి ప్రతాప్ , ఇన్స్పెక్టర్ లు సతీష్ ,ప్రేం, శ్రీనివాస్ , ఆర్ఐ లు దామోదర్ , శ్రీనివాస్ , మల్లేశం ,ఆర్ ఎస్ ఐ విశ్వజా , సిసి హరీష్ , సిబ్బంది పాల్గొన్నారు