Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్ 6,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉమ్మడి కల్వచర్లలోని కన్నూరి శ్రీనివాస్, రాపల్లి జానకిరామ్ రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఎన్నికలకు ముందిచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిన పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని సంకల్పంతో సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలిపాక సారయ్య, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచులు గంట పద్మ, ఎండి మంజుర్, మాజీ ఎంపీటీసీ కొట్టే సందీప్, మాజీ ఉపసర్పంచులు ముచ్చకుర్తి శ్రీనివాస్, వేము కనకయ్య, నాయకులు ఒర్రె స్వరూపసదయ్య యాదవ్, నాంసాని సందీప్, రేండ్ల కృష్ణమూర్తి, ఆసం రాజు, బూడిది రాజేందర్, ఈరు రాజయ్య, వేముల సంపత్, ఆర్ల శ్రావణ్, అప్పాల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.