

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం శేరి సతీష్ రెడ్డి పార్టీ కార్యాలయం లోకూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కి పూలమాల వేసి జయంతి సందర్భంగా నివాళులర్పించారు కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కువ కాలం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని ఇండో పాక్ యుద్ధంలో ఆయన భారత రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారని కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ ని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే బి సంజీవరావు, మేకల మేకల్, కెపిహెచ్బి డివిజన్ ప్రెసిడెంట్ తమ్మినేని ప్రవీణ్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఫణీంద్ర కుమార్, దేవ సహాయం, రేష్మ, సరోజ, కొమ్ము బాబు, రాజు ముదిరాజ్, పిడికిలి గోపాల్ చౌదరి, శ్రీధర్ చారి, గిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.