Listen to this article

జనం న్యూస్:5 ఏప్రిల్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్ధిపేట:

భారత మాజీ ఉపప్రధానమంత్రి, సమాజ సేవకుడు, దళిత హక్కుల కోసం జీవితం అంకితమైన మహానాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతిని సిద్ధిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫూలే మిత్ర మండలి సభ్యులు, డాక్టర్ ఎం. శ్రద్ధానందం, దేవరాజ్, మిమిక్రీ రమేష్, ఐలయ్య రాజేందర్, విజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ గారు భారత రాజకీయాల్లో చేసిన సేవలు చిరస్మరణీయమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ఈ తరానికి మార్గదర్శకమని చెప్పారు. యువత ఆయన ఆశయాలను స్మరించుకోవాలని, ఆ దిశగా నడవాలని పిలుపునిచ్చారు.