

రుద్రూర్, ఏప్రిల్ 05 (పయనించే సూర్యుడు,
రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ మాలధారణ స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. గణపతి పూజ, నవగ్రహ పూజ, సింధూర పూజ పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివ అప్ప, గురు స్వామి మల్లేష్, వేద పండితులు, హనుమాన్ మాల ధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.