Listen to this article

ఆధునిక సాంకేతికతతో లాభసాటి సాగు పై రైతులకు శిక్షణ

200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం

రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుశివ కిరణ్ గార్డెన్స్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

జనం న్యూస్, ఏప్రిల్ 05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకం అని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఉగాది నాడు సీఎం చేతుల మీదుగా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు అందరికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా పేదలకు సన్న బియ్యం సరఫరా ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తూ ఒక్కోక్కోటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించామని, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.దేశంలో మరే రాష్ట్రంలోనూ పేదలకు సన్న బియ్యం సరఫరా వంటి పథకాలు ప్రారంభించ లేదని అన్నారు. ఆదనపు కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు తినే సన్న రకం బియ్యం నేడు పేదలందరికీ అందుతుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.సన్న బియ్యం పంపిణీ లో ఎటువంటి పొరపాటు జరగడానికి వీలు లేదని, ప్రతి ఒక్క లబ్దిదారుడికి 6 కిలోల సన్న బియ్యం సరఫరాకు రేషన్ డీలర్లు కృషి చేయాలని అన్నారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని, 15 రోజులలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రి తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లతో ఇండియా గురుకులాల నిర్మాణం చేపట్టామని అన్నారు. సోమనపల్లి వద్ద 200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు తాళ్ళ కట్టింగ్ తో ఇబ్బందులు పడితే మన ప్రజా ప్రభుత్వం కట్టింగ్ కు స్వస్తి పలికి చెన్నారకం వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు.25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 681 కోట్ల రూపాయల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామని అన్నారు. వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి 1800 కోట్ల బోనస్ అందించామని అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలి అనే అంశం పై రైతులకు శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.నిరుద్యోగ యువతీ యువకులకు కోసం జాబ్ మేళా నిర్వహించామని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ విడుదల చేస్తుందని, 50 వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ పై యూనిట్ల పంపిణీ చేస్తున్నామని అన్నారు.మహిళలకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ పథకాలు సదుపాయాలను ఉపయోగించుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల డిఎం, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ, పరిశ్రమల శాఖ జిఎం, మంథని డివిజన్ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు. కె డి సి చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.