Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల

కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూ దిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళు లు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభావుడు జగ్జీవన్ రామ్.. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంతరం చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్లో కార్మిక కమ్యూనికేషన్ మంత్రిగా పని చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ చిందం రవి దుబాసి కృష్ణమూర్తి కట్టయ్య బసాని మార్కండేయ మస్క కుమారస్వామి వల్పదాసు వెంకటరమణ వాల్పదాస్రాము తిరుపతి తదితరులు పాల్గొన్నారు….