

జనం న్యూస్ ఏప్రిల్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం పరకాల డివిజన్ పరిధిలోని శాయంపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తోలిసారిగా శాయంపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్ సర్కిల్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. స్టేషన్ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారిగా సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్ సిబ్బందిని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ అధికారులకు పలుసూచనలు చేస్తూ నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్, ఎస్సై జక్కుల పరమేశ్వర్ పాల్గొన్నారు…