

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నేటితరం నేతలు దివంగత నాయకుడుమాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ముందుకు సాగాలని నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ జిల్లా మాజీ మైనారిటీ కార్యదర్శి సయ్యద్ అమీర్ భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతురాజు మస్తానయ్య మోడపోతుల రాము లు అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని కూటమినేతల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు భారత పార్లమెంటులో వివిధ మంత్రి పదవులు అలంకరించి రాజకీయవేత్తగా సంఘ సంస్కర్తగా దేశంలోనే మంచి పేరు పొందారన్నారు. అంటరానితనం రూపు మాపేందుకు ఆయన చేసిన సేవ ఎ నలేనిదన్నారు. అలాంటి మహానుభావుడి అడుగుజాడల్లో ప్రతి నేత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మౌలా మెహర్ కుర్ర మణి యాదవ్ గురు ప్రసాద్ తుమ్మాది శివకుమార్ పో మ్మల శివ నరసింహులు నారాయణ వెంకటేష్ నరసింహులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
