

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఆదిమల్లు రాము రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గీడిమెట్ల రమేష్ మరియు సభ్యుల ఆహ్వానం మేరకు నర్సాపూర్ క్రాస్ రోడ్డు బాలనగర్ వద్ద జరిగిన బాబు జగజ్జివన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగ కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహమునకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గడ్డం నాగరాజు కిషోర్,బోగాది వెంకటేశ్వరరావు,వేముల మహేష్,జెన్నేసునీల్,పోతుల నరేష్, పోలెబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు,కళ్యాణ్ నగర్ అధ్యక్షుడు వంగల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.