Listen to this article

సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్


జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకయుక్త కమిషన్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించాలని కోరారు.రాష్ట్ర సమాచార కమిషన్ పదవి కాలం ఫిబ్రవరి 2023 లో ముగిసిందని, రెండు సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుండి సమాచార కమిషన్ ఏర్పాటు చేయక పోవడంతో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది దరఖాస్తులు(అప్పీల్ లు, ఫిర్యాదులు) పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. సమాచార కమిషన్ లేకపోవడంతో ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పిలెట్ అధికారులు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు కోరే సమాచారం సకాలంలో అందకపోవడం వల్లన చట్టం పైన ప్రజలకు విశ్వాసం పోయే అవకాశం ఉందని అన్నారు. సమాచార హక్కు చట్టం పకడ్బందీగా, పారదర్శకంగా అమలు కావడం కొరకు గతంలో రాష్ట్ర హైకోర్ట్ సూచించిన విధంగా రాష్ట్ర సమాచార కమిషన్ త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కమిషన్ లేకపోవడంతో డ్రైవర్ లేని బస్సుల ఉందని అన్నారు. ఇప్పటికైనా త్వరగా రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టం బలోపేతం గా అమల కొరకు కృషి చేయాలని, రాష్ట్ర ప్రజలకు సహ చట్టంపై నమ్మకం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగారి ప్రవీణ్, జిల్లా ముఖ్య సలహాదారులు ఆర్ కృష్ణ, సిర్పూర్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, కాగజ్నగర్ మండల కార్యదర్శి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.