Listen to this article

రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు

జనం న్యూస్ ఏప్రిల్ 05 జిల్లా బ్యూరో ఇంచార్జి

బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయమని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, దేశ మాజీ ఉప ప్ర‌ధాని డాక్టర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకం అని, దేశానికి ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన, అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన చేసిన నిస్వార్థ సేవ గురించి నేటి తరం యువత తెలుసుకోవాలన్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అయన కృషి ఆదర్శనీయమని
ఆ మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ అన్నారు.కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఉట్నూర్ డివిజన్ సభ్యులు అతీష్ కుమార్, కాటం రమేష్,మెస్రం భరత్, బాబా సాహెబ్, తదితరులు ఉన్నారు