

జనం న్యూస్ – ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఏఈ/ 77 నందు బాబు జగ్జీవన్ 117 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలుపూరి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మందాసంజీవయ్య, లింగాల పెద్దులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం వారు మాట్లాడుత రాజకీయవేత్తగా సంఘసంస్కర్తగా దేశంలోనే మంచి పేరు పొంది అంటరానితనం రూపుమాపేందుకు ఆయన చేసిన సేవ ఎనలేనిది అన్నారు అలాంటి మహానుభావుడు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూఅట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని నేటి యువత ఆయన సేవలను గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, గుంటి కోటేశ్వరరావు, కోరే ప్రేమ్ చంద్, సాగర్ బాబు ,యోహాను, ఏడుకొండలు, రామస్వామి, రఘువీర్, మేడే సైదమ్మ, పెంచలయ్య, కిషోర్ బాబు, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.