Listen to this article

అన్ని విధాల సాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నాం..

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్..

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

రాష్ట్రం లోనే రెండో భద్రాదిగా పేరుపొందిన ఇల్లందకుంట లోని శ్రీరామ మందిరానికి శ్రీరామ నవమి రోజు వచ్చే భక్తులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించి పండుగ సంతోషంగా జరుపుకోవాలని హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే శ్రీరామనవమి వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శ్రీరామ నవమి రోజు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు కనుక ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ స్వామి వారి దర్శనానికి వెళ్లాలని సూచించారు. అలాగే శ్రీరామ నవమి సందర్భంగా గుడికి వచ్చే భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పిక్ పాకెటర్స్ ఉంటారని, ముఖ్యంగా మహిళలు ధరించే ఆభరణాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా విభాగాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. పండుగ సందర్భంగా పోలీస్ వారు సూచించిన విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రశాంతంగా పండగ జరుపుకోవచ్చని అన్నారు. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎలా దర్శించుకోవాలో సూచనలు చేస్తున్నామన్నారు.హుజురాబాద్ జమ్మికుంట నుంచి వచ్చే భక్తులు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద డైవర్షన్ తీసుకొని పార్కింగ్ నంబర్ 1 2లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్లాలన్నారు. సాధారణంగా వెళ్లే వాహనదారులు సిరిసేడు మీదుగా వెళ్లాలని సూచించారు. సిరిసేడు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను నెంబర్ 3,4 లలో పార్కింగ్ చేయాలి. సాధారణంగా వెళ్లే వాహనదారులు వృద్ధాశ్రమం నుంచి కెనాల్ మీదుగా శ్రీరాములపల్లి నుంచి జమ్మికుంట చేరుకోవాలన్నారు మల్యాల మీదుగా వచ్చే భక్తులు పార్కింగ్ నెంబర్ 5 లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అదేవిధంగా సాధారణ వాహనదారులు కెనాల్ మీదుగా శ్రీరాములపల్లి నుంచి జమ్మికుంటకు చేరుకోవాలని అన్నారు. నోట్::: శ్రీరామనవమి పండుగ కోసం చేపట్టిన ట్రాఫిక్ నిబంధనల మీద ఒక వీడియో కూడా చేశామని, భక్తులందరూ విధిగా ఆ వీడియో చూడాలన్నారు. ఆ వీడియోలో ఏ ప్రాంతాల నుంచి ఎటు వెళ్లాలో స్పష్టంగా తెలియజేశామని అన్నారు. ప్రతి ఒక్కరు వీడియో చూసి వారికి సూచించిన విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ జి అన్నారు.