Listen to this article

జనం న్యూస్ 5ఏప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.


జైనూర్: సన్నబియ్యం పేదలకు వరం అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు.శనివారం మార్లవాయి గ్రామంలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు ఆమె సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కుడిమేత విశ్వనాత్, మండల అధ్యక్షుడు ముఖిద్, మాజీ సర్పంచ్ కనక ప్రతిభ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.