Listen to this article

ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి

జనం న్యూస్,5 ఏప్రిల్ 2025 భీమారం మండల ప్రతినిధి (కాజీపేట రవి )

భీమారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన, అట్టడుగు వర్గాల కొరకు పోరాటం చేసిన మహా వ్యక్తి అని ప్రసంశించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయలని, ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని తరుణమిది అని తెలిపారు. 28 ఏళ్ల వయసులో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందని అన్నారు. జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, కమ్యూనికేషన్లు, రక్షణ మంత్రిత్వ శాఖలతో సహా ముఖ్యమైన పదవులను చేపట్టి, దేశంలో పలు మార్పులకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆయన నాయకత్వంలో దేశ విధానాలు, పాలనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా రెండుసార్లు చేపట్టి తన హరిత విప్లవానికి నాంధి పలికారని కితాబిచ్చారు. ఆయన వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు నేటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 1974 ఏర్పడిన ఆహార సంక్షోభం సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారని తెలిపారు. దళిత హక్కుల కోసమే కాదు, మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొని, అందరినీ చైతన్యపరిచేవారని చెప్పారు. చరిత్ర గురించి తెలిసిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారని, స్వాతంత్ర సమరయోధులను, పోరాట యోధులను మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మనందరం అటువంటి మహానుభావుల వారి ఆశయాల దిశగా అడుగులు వేయాలని, వారి అడుగుజాడల్లో నడవాలని మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి పిలుపునిచ్చాడు ,