

స్వతంత్ర సమరయోధుడిగా మొట్టమొదటి భారతదేశ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు..
జమ్మికుంట మాజీ జడ్పిటిసి శ్రీ రామ్ శ్యామ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంటలో మాజీ జెడ్పిటిసి కార్యాలయంలో డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ.. డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ దళిత జాతిలో పుట్టిన గొప్ప నేతని, వారు కొనియాడారు. స్వతంత్ర సమరయోధుడిగా మొట్టమొదటి భారత దేశ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని వారు కొనియాడారు. ఉప ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో అనేక సంస్కరణలకు నాంది, పలికిన గొప్ప దేశభక్తులుగా పేరు గాంచిన నేత అని వారి ఇ సందర్భంగా తెలియజేశారు. ఆనాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప సంస్కరణ యోధుడిగా పేరుగాంచిన మహానయుడని వారి సందర్భంగా కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగాలని నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని వారు సందర్భంగా పేర్కొన్నారు. నూతన తరానికి మార్గదర్శకంగా బాబు జగ్జీవన్ రావ్ ఆదర్శంగా తీసుకోవాలని వారి సందర్భంగా తెలియజేశారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం కృషి చేసిన గొప్ప యోధుడని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోడేటి అనిల్, గొట్టి హర్షవర్ధన్ ,అరవింద్, హరికృష్ణ ,మహేష్ ,ప్రకాష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.