

జనం న్యూస్ 05 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ తాను బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక సందర్భాల్లో వారికి సంబంధించినటువంటి విషయాల్లో పోరాడి హక్కులను సాధించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మహనీయులు వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఆధారంగా మనం జీవనం కొనసాగిస్తున్నాం. బాబు జగ్జీవన్ రామ్ సుమారు 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా 33 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి అనేక శాఖలలో మంత్రిగా పనిచేసే రిజర్వేషన్లు ఉద్యోగాలు లేదా బీద దళిత వర్గాలకు బలహీన వర్గాలకు న్యాయం చేసేటటువంటి శాఖలకు మంత్రిగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ కార్యక్రమంలో మహనీయుల ఆశయాలకు కనుగుణంగా యువత విద్యార్థులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్, మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జిహెచ్ఎం అంజయ్య, టిఎన్టిఎఫ్ పెద్దలు బుగ్గన భీమయ్య, సున్నం గంటి రాజు, కృష్ణ, గట్టుపల్లి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.