

జనం న్యూస్- ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బాబు జగ్జీవన్ రామ్ సమతా ప్రాంగణంలో మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, స్వాతంత్ర సమరయోధుడు దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని,అణగారిన వర్గాల ఆశాజ్యోతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అణగారిన, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిన మహావ్యక్తి అని ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన సేవలను మనందరం గుర్తుంచుకోవాలని బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వం లో కార్మిక కమ్యూనికేషన్లు రక్షణ మంత్రిత్వ శాఖలతో సహా ముఖ్యమైన పదవులను చేపట్టి దేశంలో పలు మార్పులను తీసుకువచ్చారని ఆయన నాయకత్వంలో దేశ విధానాలు పాలనను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని హరిత విప్లవానికి నాంది పలికారని, ఆయన వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు నేటికీ గుర్తుండిపోతాయని 1974లొ ఏర్పడిన ఆహార సంక్షోభం సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు అన్నారు, దేశంలో ఎక్కువ కాలం పని చేసిన క్యాబినెట్ మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారని దళిత హక్కుల కోసమే కాక మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొని అందర్నీ చైతన్యపరిచేవారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహారాజుల సేవా సంఘం సభ్యులు వీరబాబు, కె నకులరావు, కొమ్ము పుల్లారావు, జి భద్రయ్య, కే రాందాస్, ,శ్రీనివాస్, ముందా రఘువీర్, కొమ్ము పూర్ణ, అలుపూరి శ్రీనివాస్, మంద సంజీవయ్య, లింగాల పెద్దులు,సతీష్ ,గోరంట్ల శివరాం ప్రసాద్, పిల్లి శ్రీనివాస్, మర్రి నరేందర్, గణేష్ తంగరాజు తదితరులు పాల్గొన్నారు.