Listen to this article

జనం న్యూస్ జనవరి 15 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య… తేది:15-1-2025 బుదవారము రోజున కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అడహాక్ కమిటి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవముగా ఎన్నికై మొట్ట మొదటి సారి గంగాధర మండలం కురుమపల్లే (ర్యాలపెల్లి) గ్రామానికి విచ్చేసిన కడారి అయిలన్న కురుమను గంగాధర మండల కురుమ సంఘం అధ్యక్షులు దానె ఓదెలు కురుమ మరియు కురుమపల్లి కురుమ కుల సంఘం పెద్దలు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగినది. ఈ సందర్బంగా కడారి అయిలన్న కురుమ మాట్లాడుచూ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లాలోని కురుమ సంఘం నాయకులు అవకాశమున్న ప్రతి గ్రామములో ఖచ్చితంగా పోటీ చేయాలన్నారు. పార్టీలకతీతంగా వార్డ్ మెంబర్, సర్పంచ్. యం పి టి సి, జెడ్ పి టి సి, యం పి పి మొదలైన ఏ పోటీకైన కురుమలంతా ఐక్యంగా అధిక సంఖ్యలో మన జనాభాకు తగిన విధంగా అత్యధిక సంఖ్యలో పోటీచేసి గెలుపొందవలసిన అవసర మున్నదన్నారు. ప్రస్తుతం ఎవరికి వారుగా తమ తమ పనులలో నిమగ్నమై భిజీగా ఉన్న కురుమలు రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నారు. మన పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కురుమ లంతా ఎవరి స్థాయిలో వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నారు. గతంలో ఐక్యంగా ఇతరులకు ఓట్లు వేసిన మనం అదే ఐక్యతతో మనవాళ్లను గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమములో కురుమ సంఘం గంగాధర మండల అధ్యక్షులు దానె ఓదెలు కురుమ, కురుమపల్లి కురుమ సంఘం అధ్యక్షులు మొట్టే ఓదెలు కురుమ, కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జడ కమలాకర్ కురుమ, కురుమ సంఘం కోశాధికారి దానె నర్సయ్య కురుమ, పెద్దలు మొట్టే నర్సయ్య కురుమ, ఇరుమల్ల కొమురయ్య కురుమ, పెద్ద కురుమలు దానె భీరయ్య కురుమ, దానె నర్సయ్య కురుమ, మాజీ ప్రధాన కార్యదర్శి ఇరుమళ్ల మల్లేశం కురుమ, కరీంనగర్ బీరప్పస్వామి దేవాలయ కమిటి ప్రధాన కార్యదర్శి దానె అశోక్ కురుమ, కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈరల్ల విజయ్ కుమార్ కురుమ, కురుమపల్లి కురుమలంతా సంక్రాంతి భీరయ్య పండుగ రోజు హాజరై హార్థిక శుభాకాంశాలు తెలుపారు.