

జనం న్యూస్ – ఏప్రిల్ 6 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
భారత తొలి దళిత ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బస్టాండ్ వద్ద నందికొండ మున్సిపాలిటీ మాదిగ సోదరుల ఆధ్వర్యంలో మరియు ఎస్.సి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.అనంతరం జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్ పాల్గొని మాట్లాడారు.. స్వాతంత్ర్య సమరయోధులు , సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని అన్నారు.బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
ఎస్.కోటేశ్వరరావు(ల్యాబ్)మాట్లాడుతూఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదాసు విక్రమ్,చంద్రమౌళి, ఆడెపు నాగర్జున, గుంటి సూర్య కోటేశ్వరరావు,నిర్మలజానీ, ప్రెస్ శీను, అలుపూరి శ్రీనివాస్, చిత్రం శ్యాం కుమార్, దండు రవి, అందుగుల రాజీవ్ తదితరులున్నారు.