

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా పల్నాడు జిల్లా ప్రజలకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసినారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేశారు మానవాళికి శ్రీరాముని జీవితం ఆదర్శమని ప్రతి ఒక్కరూ రాముల వారి అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు రేపు ఏప్రిల్ ఆరో తేదీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు మరియు కార్యకర్తలు అందరూ వారి వారి ఇళ్లపై భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయవలసిందిగా రాష్ట్ర పార్టీ ఆదేశాను ప్రకారం జిల్లా పార్టీ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఎస్సీ నాయకులు పేరయ్య బీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరరావు క్రియాశీల సభ్యుడు రాయుడు తదితరులు పాల్గొన్నారు