

జనం న్యూస్,ఏప్రిల్ 05,అచ్యుతాపురం:
వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై పూర్తి దృష్టి సారించారు గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకూ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఇందులో
అచ్యుతాపురం మండలం యాత్ అధ్యక్షులుగా కారుకుండి గంగూలీ శ్రీనును నాలుగో సారి నియమించారు.ఈ సందర్భంగా యాత్ అధ్యక్షులుగా నాలుగోసారి అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్ మరియు యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,జిల్లా అధ్యక్షులు బూడి ముత్యాలు నాయుడు, పార్లమెంట్ ఇంచార్జి ధర్మశ్రీ, జడ్పీటీసీలు లాలం రాము,నర్మాల కుమార్,ఎంపీపీ కోన సంధ్య బుజ్జి, ఎంపీపీ చేకూరి శ్రీనువాసురావు మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా పై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు రానున్న రోజులలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.