

బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామంలో వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న జొన్న,వరి పంటలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పరిశీలించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికే అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించడం జరిగిందని తెలిపారు.. కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందకూడదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, డెలికేట్ విట్టల్ రెడ్డి, పుల్కల్ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, గోపాల్ రెడ్డి, సాయిని అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

