

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సాధించిపెట్టి బాపూజీ మహాత్ముడు అయితే అత్యధిక శాతం పేద ప్రజల పక్షాన నిలిచి జీవితాంతం వారి కోసం పోరాడిన పితామహుడు బాబూజీ అని చిలకలూరిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అన్నారు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రాముల విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా జయంతి జేజేలు పలికారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో జన్మించి విద్య ప్రాధాన్యతను గుర్తించి ఉన్నత విద్యను అభ్యసించి దేశ రాజకీయాల్లో ఉన్నతుడిగా ఎదిగిన అజరామరుడు బాబు జగజీవన్ రామ్ అని వేనోళ్ళ కొనియాడారు బాబుజి తాను చేపట్టిన ప్రతి పదవికి పోటీ వన్నెతెచ్చారని పేద ప్రజల పక్షాన స్థిరంగా నిలిచారని అందుకే పేద ప్రజల పితామహుడిగా చరిత్ర పుటలకి ఎక్కారని అన్నారు ప్రధాని రాష్ట్రపతి పదవులు తప్ప జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పదవులు నిర్వహించిన మహోన్నత నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని అన్నారు భారతదేశ చరిత్రలో పేద ప్రజల పక్షాన నిలిచి అజరామరమైన కీర్తిని గడించిన వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రాములు అగ్రగణ్యులు అని వారి ఆలోచన విధానమే పేద ప్రజలకు దిక్సూచి యై నడిపిస్తుందని సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె పోగు రాజు మిరియాల వెంకటరత్నం కోవూరి రాజా కారు చోల స్వప్న కుమార్ రెడ్డి నర్సిరెడ్డి ఎం ప్రసాద్ షేక్ మహబూబ్ సుభాని ఎప్పాల అంజిరెడ్డి అల్లాడి హరిబాబు వేజెండ్ల అనిల్ కుమార్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.