Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సీఐటీయూ జాతీయ నాయకులు మందడపు సాయిబాబు మాట్లాడుతూ పల్లెల్లో ముగ్గులు పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు,  గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఉపసర్పంచ్ జివిఆర్ ని  అతిథులు అభినందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామంలో వితంతువులు, వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు జివిఆర్ ఆధ్వర్యంలో  అందరికీ దుప్పట్లు అందజేశారు.  ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి గజేంద్రుల అంజలి, రెండో బహుమతి గుగ్గిళ్ళ విజయలక్ష్మి, మూడో బహుమతి పొరల జస్మిత, నాలుగో బహుమతి బొమ్మ సింధు, పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వర్ణ నరేంద్ర కుమార్,  సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొంగల తిరుపతిరావు,  మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కార్యదర్శి ఏర్పుల రాములు, ఇటికాల లెనిన్, బానోత్ అమల, పి. నాగార్జున, జన్నారం  అడప రామారావు, ఆరికాయలపాడు మాజీ  సర్పంచ్ దుగ్గిరాల ముత్తమ్మ, మాజీ ఉప సర్పంచ్ గుడ్ల నాగమణి, ఉదారపు నాగేశ్వరరావు, బట్టు హనుమంత్ రెడ్డి, పోరల్ల విజయ, దొడ్డపునేని లక్ష్మయ్య, మందడపు వెంకటేశ్వరావు, వనమా శ్రీనివాసరావు,కూరపాటి నరసింహారావు, కూరపాటి మధు, ఎనగంటి వీరభద్రం,  గార్లపాటి రాఘవులు, రేళ్ళ సుబ్బయ్య, గంజి నాగేశ్వరరావు, కోటా సతీష్, గుడ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.