

జనం న్యూస్ ఏప్రిల్ 05
నడిగూడెం మండల కేంద్రంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న వర్క్ సైట్ వద్ద శనివారం ఉపాధి కూలీలకు నడిగూడెం పల్లె దవఖాన డాక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బంది ఓఆర్ఎస్ పాకెట్లను అందజేశారు.ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలు అనారోగ్య బారిన పడకుండా ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.ఎండలో పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధి కూలీలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి, ఆశా కార్యకర్తలు సునీత, శ్రీలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.