Listen to this article

బీజేపీలో అహంకారం పెరుగుతోంది

నిజాయితీగా సేవ చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలి
సేవ చేస్తే ప్రజలే

జైబాపు జైభీమ్ జైసంవిధాన్ లక్ష్మి పూర్ పాదయాత్రలో విశ్వప్రసాద్ రావు

జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

వాంకిడి మండలం కేంద్రం లోని పలు గ్రామలలో ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు జైబాపు జైభీమ్ జైసంవిధాన్ పాదయాత్రలో భాగంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ పై బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని డీసీసీ అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతల్లో పెరిగిపోతున్న అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిజాయితీ, నిబద్ధతలతో పేద ప్రజలకు సేవ చేస్తే ఎన్నికలలో ప్రజలే వారిని గెలిపించుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా లక్మి పూర్ ప్రసంగిస్తు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్, అంబేద్కర్ అంటూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారని గుర్తు చేసారు. దీనికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. బీజేపీ నేతలలో అహంకారధోరణి పెరిగిపోయిందనడానికి అమిత్ షా వ్యాఖ్యలే నిదర్శనమని విశ్వప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తుందని, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పారు. తాజాగా ప్రతి పేదవాడికీ సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా పేదలందరికీ వస్తాయన్నారు. వాటి కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ కమిటీ సభ్యులే ఇంటింటికీ వచ్చి పేదలకు ఇళ్లను మంజూరు చేయిస్తారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పేదలు తమ ఇంటికి పునాది వేసిన వెంటనే వారి ఖాతాలోకి లక్ష రుపాయలు నేరుగా వస్తాయని, వీటి కోసం ఎవరికీ ఒక్క రుపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ప్రజా ప్రభుత్వంలో తమ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతల తరహాలో కాకుండా నీతి నిజాయితీ నిబద్ధలతో ప్రజలకు సేవ చేస్తే పేద ప్రజలే వారిని ఎన్నికలలో గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ మాడొకర్ అనిల్, గుర్నూలే మెంగజీ,దుర్గం జీవన్, జాడి సునీల్ అరుణ్, రాజేష్, డోకే భీం రావు, ఐబీసీ సెల్ అధ్యక్షులు గణేష్, హనుమతు, దీపక్ వాడై పండు, భూషణ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు