

యువత జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా,స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి
తహశీల్దార్ ఆంజనేయులు
జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మునగాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగినది తహశీల్దార్ ఆంజనేయులు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ..భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవిత కాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని అన్నారు.దేశంలో అత్యధిక కాలం పార్లమెంటరీ సభ్యుడుగా ఉన్న ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని, వ్యవసాయ , రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారని బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగినా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వాతంత్రం, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు పోయే విధంగా కృషి చేశారని అన్నారు.ప్రతి ఒక్కరూ క్రమ పద్ధతిలో జీవన విధానం మలచుకొని ముందుకు వెళ్లి జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు. నేటి యువత జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా,స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.