

జనం న్యూస్ 05 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని మన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలీ విజయ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కొత్త పేట ఆనంద్, వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పేదవారికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పేదలకు దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుపునిండా సన్న బియ్యం అన్నం తినాలనే కల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ దినేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంగ్లా యాదయ్య,సొసైటీ డైరెక్టర్ బ్యాగరి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సలహాదారులు కె. చంద్రకాంత్, దోమ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండీ షబ్బీర్, గ్రామ మైనార్టీ అధ్యక్షులు ఎండీ సర్దార్,కైసార్, ఈశ్వయ్య, రాఘవేందర్ రెడ్డి, డీలర్ మైపాల్ రెడ్డి, కొత్తపేట రాఘవేందర్, రమేష్ గౌడ్, గుర్రప్ప, సండి కృష్ణయ్య, ఎర్ర సారంగి, శ్రీనివాస్, చంద్రయ్య, గోపాల్,యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.