Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట// కుమార్ యాదవ్

జమ్మికుంట మండలం తనుగుల గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ పైడిపల్లి సమ్మయ్య అను కార్మికుడి తల్లి మరణించినారు, శనివారం రోజున ఆయన ఇంటికి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మరియుమండల గ్రామ పంచాయతీ యూనియన్, నాయకులు వెళ్లి పరామర్శించారు. జమ్మికుంట మండల యూనియన్ సహకారంతో యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఏండిగా రవీందర్రావు, లద్దనూరు కుమార్ మరియు కమిటీ సభ్యులు కోశాధికారి, మేక మల్ల రాము, సమ్మయ్య చేతికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పేరుగు అశోక్, ఆసాల సారయ్య, కమిటీ సభ్యులు, రాచపల్లి మొగిలి, రవి, భద్రయ్య, సంపత్, సతీష్, ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.