

ముస్తాబు అవుతున్న ఆలయాలు
జనం న్యూస్,ఏప్రిల్5, జూలూరుపాడు( రిపోర్టర్ జశ్వంత్)
శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్నీ జరుపుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయాలను ఎంతో అంగరంగ వైభవంగా రంగు రంగుల అలంకరణలతోటి,భక్తులకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నుల విందుగా తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.మండలంలోని పడమట నరసాపురం గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తులు,గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ సభ్యులు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంను మరియు సుమారుగా రెండువేల మందికి సరిపడా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.