

జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్బంగా ఈ రోజు జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయం లో వారి చిత్రపటానికి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఆర్ ప్రభాకర రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. డా.బాబు జగ్జీవన్ రామ్ మహనీయుడు ,స్వతంత్ర సమరయోధుడు మరియు గొప్ప సంఘసంస్కర్త అని తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా కూడా దేశానికి సేవలు అందించారని అన్నారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారని, విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా గాంధీతో కలిసి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారని, మొదటి మంత్రివర్గంలో స్థానం సంపాదించి దేశానికీ సేవలు అందించారని అన్నారు. కరువు కోరల్లో చిక్కిన భారతావనికి వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సహకారం చేసి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని. యావత్ భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారని ఇటువంటి మహనీయుల ఆశయాలను మనమందరం ముందుకు తీసుకపోవాలని, వారు దేశానికి చేసిన సేవలని యువత, స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్. ఐ అడ్మిన్ పెద్దన్న , ఆర్.ఎస్.ఐ లు రాజేష్, లవన్,సందీప్, కిరణ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏ.ఆర్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
