

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమనేని పరశురాం రావు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిరి షరీఫ్ మరియు పాపయ్య పల్లె గ్రామాలలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలతో వాడ,వాడన,,గడప గడపకు పాదయాత్ర జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరుశురామరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.వారు మాట్లాడుతూ… బిజెపి పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఏదైతే 400సీట్లు వస్తే రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తామని పదేపదే పార్లమెంటులో గాంధీ పై మరియు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరంకుశ ధోరణికి పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం దగ్గరలో ఉంది అని తెలియజేస్తూం అన్నారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ, స్వాతంత్రం,సమానత్వం అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారు, అని అలాంటి రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ పాలన చేద్దామని చూస్తున్న బిజెపి పార్టీ ని భవిష్యత్తులో తిరగనియ్యమని హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే భారత రాజ్యాంగాన్ని మరియు భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమలో ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిళి రాకేష్ ముదిరాజ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గూడెపుసారంగ పాణి , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగాజు,మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్, గ్రామ శాఖ అధ్యక్షులు వజ్జపల్లి సంతోష్, మాడిశెట్టి రాందాస్, గోశెట్టి సతీష్, సూరం పోశెట్టి, ఆకుల సంపత్, చందుపట్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముద్దసాని రాములు పోలోజు సదానంద చారి పువ్వాల రాములు బిజిగిరి మల్లేశం, నితీష్ ,ఎండీ. అలీ షరీఫ్, రాచపల్లి రాజకుమార్,రాచపల్లి జగన్, రాచపల్లి రమేష్, సారయ్య, కొమరయ్య, రాజు, ఏ్స్.సర్పంచ్ సూరంపోశెట్టి, ఏ్స్.సర్పంచ్ రాచపల్లి సదయ్య యుగేందర్, మోర్ సురేష్ గుండెకారి రాకేష్, వేణు, చంద్రం, మిస్సాడి వెంకన్న, గెల్లు రాజు,వాజ్జపల్లి రాజు, దొగ్గల భాస్కర్, మ్యాకమల్ల అశోక్ కొండు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
