

జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన కల్లెపెల్లి మురళి అనారోగ్యంతో చనిపోగా మృతుడి కుటుంబానికి పిఎంకె ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో పాటు బియ్యం అందజేశారు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన కల్లేపల్లి మురళి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఫౌండేషన్ నిర్వాహకులు శనివారం రోజున మృతుడి పిల్లలకు 5000 వేల రూపాయల నగదు తో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి గౌడ్, గండీ రంజిత్ కుమార్ గౌడ్, బండారి శ్రీనివాస్ యాదవ్ ,బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.