

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు
జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామంలో 5సం.ల మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17సం.ల మైనరు బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఏప్రిల్ 5న ఎల్.కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగరాయపురం గ్రామంలో ఏప్రిల్ 4న రాత్రి టీవీ చూసేందుకు మైనరు బాలిక ఇంటికి వచ్చి, ఇంటిలో ఇతర కుటుంబ సభ్యులు వేరే పనుల్లో ఉండగా, మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా మైనరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ కోట పోలీసులు పోక్సో కేసు నమోదు చెయ్యగా, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. నేరంకు పాల్పడిన 17 సం.ల మైనరు బాలుడ్ని అదుపులోకి తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి జూవినల్ జస్టిస్ కోర్టుకు తరలించామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఈ కేసులో నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
ఎల్ కోట లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎల్ కోట ఎస్సై నవీన్ పడాల్ పాల్గొన్నారు.