Listen to this article

జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడికి పాల్పడిన కేసు మిస్టరీని త్వరలో ఛేదిస్తామని, నిందితులను త్వరితగతిన కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రామంలోని నేరం జరిగిన స్థలానికి చేరుకొని, సాంకేతిక ఆధారాలు సేకరించామన్నారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.