Listen to this article

జనం న్యూస్ – ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది కళాకారులకు నిలయంగా ఉన్న ఒకప్పటి రంగనాథ రంగశాల (ఆడిటోరియం) ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులకు, ఉద్యోగులకు ఆటవిడుపుగా ఈ కళావేదికను నిర్మించారు, ఎంతోమంది కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు,ఎంతోమంది అధికారులు, ఉద్యోగులు తమ కళా ప్రావిణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు, అలనాటి రంగనాథ రంగశాల (ఆడిటోరియం) ఇప్పుడు కళావిహీనంగా మారి ముళ్ళ కంపలు ,పిచ్చి చెట్లతో పాడుబడ్డ భవనంల మారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది, ఆధునీకరణ, కంప చెట్ల కొట్టివేత పేరుతో కాంట్రాక్టర్లకు కాసుల పంటగా మారింది, ఎన్ ఎస్ పి అధికారుల అలసత్వం తో ఈ భవనం వాడుకలోకి మాత్రం రావట్లేదు, నాగార్జునసాగర్ పరిధిలోని విలువైన ఎన్ఎస్పి భూములు, భవనాలు కబ్జాలకు గురికాగా చివరికి మిగిలింది ఈ రంగనాథ రంగశాల(ఆడిటోరియం) మాత్రమే, ఎన్ఎస్పి అధికారులు ఈ భవనాన్ని వాడుకలోకి తెస్తారో లేక రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి దీర్ఘకాలికంగా ప్రైవేటు వ్యక్తులకి లీజుకు ఇచ్చి చేతులు దులుపుకుంటారో వేచి చూడాలి, ఇప్పటికైనా ఎన్ఎస్పీ అధికారులు, రాజకీయ నాయకులు దృష్టి సారించి ఈ రంగనాథ రంగశాల ( ఆడిటోరియం) ను వాడుకలోకి తేవాలని స్థానిక ప్రజలు, కళాకారులు కోరుతున్నారు.