Listen to this article

సంఘటన స్థలాన్ని పరిశీలించిన హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్.

జనం న్యూస్. ఏప్రిల్ 5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్ఫరెన్స్ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, హత్నూర ఎస్సై సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని బోర్పట్ల గ్రామ శివారులోని భీముని చెరువులో శుక్రవారం ఈత కొట్టడానికి వెళ్లిన డప్పు చంద్రమౌళి అల్లుడు ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఈత కొడుతూ కొద్ది సేపటికి నీటిలో ఊపిరిఆడక పోవడంతో మునిగి పోయాడు, అది గమనించిన డప్పు నవీన్ అనే మరో యువకుడు నీటిలో ఈతకు వెళ్లిన యువకుడు కనిపించకపోవడంతో, అతను కూడా చెరువులో దిగి ఈత కొడుతూ ఊపిరాడక నీటిలోమునిగిపోవడంతో ఇద్దరుయువకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇద్దరు యువకులు భీముని చెరువులో గల్లంతయ్యారని విషయం తెలుసుకున్న స్థానిక తహసిల్దార్ పర్వీన్ షేక్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, పోలీసుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మృతి దేహాలను వెలికి తీయాలని సూచించారు, ప్రేమ్ కుమార్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం. వీరభద్రపల్లి గ్రామంగా గుర్తించారు. దీంతో రెండు మృతి దేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు,