

జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లో ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్న మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వాగతం.. ధర్మసంస్థాపనకై అవతరించిన సత్యస్వరూపుడు, న్యాయపరుడు అయిన శ్రీరాముని జన్మదినమైన పవిత్ర శ్రీరామనవమిని పురస్కరించుకుని, ఈ పర్వదినం మీరు, మీ కుటుంబ సభ్యులు, సమాజమంతా ఆనందంగా, ఆయురారోగ్యాలతో, శాంతిసౌఖ్యాలతో గడవాలని మనసారా (జనం న్యూస్ )తరుపున కోరుకుంటున్నాను.
శ్రీరాముని ఆదర్శ జీవితం మన అందరికీ ప్రేరణగా నిలవాలి, ఆయన పాటించిన సత్యం, ధర్మం, సమానత్వం వంటి విలువలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలాని ఆశిస్తున్నాను.
ఈ పవిత్ర సందర్భంగా మన గ్రామాలు, మన మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, సామాజిక న్యాయం, ఐక్యత, సమానత్వం విలసిల్లే సమాజం ఏర్పడాలని కోరుకుంటూన్నాను, మీ…హుజురాబాద్ నియోజకవర్గ జనం న్యూస్ రీపోటర్ కుమార్ యాదవ్ కొంగల.
