

హక్కులకై పోరాడు బాధ్యతలకై నిలబడు….
అనే నినాదంతో భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప మేధావి
హత్నూర గ్రామంలో డబ్బులతో భారీ ర్యాలీ.
జనం న్యూస్. ఏప్రిల్ 5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్)
స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో ఘనంగా నిర్వహించారు.కొండగళ్ళ దుర్గయ్య అధ్యక్షతనమొదటగా డప్పులతో గ్రామంలో భారీర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎర్రోళ్ల నర్సింలు మాదిగ ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి ఎంతగానో సేవ చేశారని మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కులకై పోరాడిన అణగారిన వర్గాల ఆపద్బాంధవుడు అని అన్నారు. వ్యవసాయ శాఖలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి భారత స్వాతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషిస్తూనే రాజ్యాంగ పరిరక్షణకై పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు, ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కొనసాగి పేద వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల అలంకరణలతో అలంకరించి ఆయన జయంతి సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు యువజన సంఘాల నాయకులు కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో- మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, హత్నూర గ్రామ తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పండగలక్ష్మి రవికుమార్. మాజీ సర్పంచ్ ఆకుల కిష్టయ్య, మాజీ సర్పంచ్ మహంకాళి నాగేష్. పిఎసిఎస్ డైరెక్టర్ గుండా రాములు, తాజా మాజీ ఉపసర్పంచ్ మెరాజ్, మాజీ ఉపసర్పంచ్ దండు సత్యవతి పెంటేష్, మాణిక్ రెడ్డి, టైగర్ నరేందర్, నల్లోల్ల మొగులయ్య, నల్లోల్ల పెంటయ్య, మైసగళ్ల ఆశయ్య, నల్లోల్ల రాందాస్, కొండగళ్ల మల్లేష్, నల్లోల్ల ఎల్లయ్య, గంధ గళ్ళ వీరయ్య , గంద గళ్ళ ప్రసాద్, ముత్తర గళ్ళ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, పొట్లగళ్ల శ్రీధర్, కాసాల దత్తు, కొండగళ్ల శేఖర్, నల్లోల్ల శ్రీకాంత్, కొండగళ్ల పవన్, ఉత్సవ కమిటీ సభ్యులు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
