Listen to this article

జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి.

ఇందూర్ నగరం : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగింది అంటే కారణం 7 దశబ్దల నుండి ఎందరో మహనీయుల జీవితాల త్యాగ ఫలం అన్నారు. • జాతియోధ్యమ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముకర్జి గారు 1951 లో మొదట జన సంఘ్ స్థాపించిన తరువాత భారతీయ జనసంఘ్‌కు ద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాయకుడు దీన దయాల్ ఉపాధ్యాయ అన్నారు. • దీనదయాల్ జీ ఆశించినట్టుగా చిట్టాచివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారత దేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యమైన దేశాంగా, ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నెలబెట్టాలనే ఆశయంతో, జాతీయ పునరనిర్మాణం లక్ష్యంగా 1980 ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. • భారతీయ జనతా పార్టీకీ రాత్రికి, రాత్రే వచ్చిన విజయం కాదని ఈ విజయాల వెనుక ఎందరో మహనీయుల బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం,కాషాయ జెండా పట్టుకొని అలుపెరగని పోరాటాలు చేస్తూ ఎన్ని అణచివేతలకు గురి చేసిన, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన, భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అంటూ 7 దశబ్దలుగా ఎందరో నాయకుల, కార్యకర్తల పోరాట ఫలితం ఈ రోజు మూడోసారి అధికారంలో కూర్చోబెట్టాయని అన్నారు. • 2 సిట్లతో మొదలై ఈ రోజు మూడో సారి ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవిధంగా ఎదగడం జరిగిందని అన్నారు. • ఒక సామాన్య కుటుంబం లో పుట్టి చాయ్ అమ్ముకున్న వ్యక్తిని కూడా ఈ రోజు దేశ ప్రధానిగా చేసిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని, కుల, మత, లింగ వివక్షత లేకుండా అన్ని వర్గాల సంక్షేమం , అభివృద్ధి కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. • గత 10 ఏళ్ల నరేంద్రమోదీ మన బిజెపి పరిపాలన చూస్తే అనేక విప్లవత్మక విజయాలు సాధించడం జరిగిందన్నారు • 76 ఏళ్ల స్వాతంత్రంలో వివిధ దేశాల రాయబారులు, అధిపతులు వస్తే ఢిల్లో సమాధుల దగ్గర పూల మాలలు వేశారు అలాంటి చరిత్రను మార్చి ఈ దేశ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సరయు నదిలో స్నానం చేసి, గంగ హారతి తీసుకొని, అయోధ్యలో రామున్ని దర్శించుకునేల అయోధ్య పునః నిర్మాణం చేసిన ఘనత బిజెపిది అన్నారు. ఈ దేశంలో అట్టడుగు స్థాయి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే దీన్ దయాల్ జీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి అవస్ యోజన,గరీబ్ అన్న కళ్యాణ్ యోజన ,ఆయుష్మాన్ భారత్,పసల్ భీమా యోజన,ఉజ్వల యోజన,సూకన్య సమృద్ధి యోజన,ముద్ర లోన్స్,ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం రిగిందన్నారు. •వికసిస్తున్న భారత దేశంలో బిజెపి సాధించిన విప్లవత్మక విజయాలు ఎన్నో ఉన్నా ఇంకా సాధించవలసినవి కూడా చాలా ఉన్నాయని భారత దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ జీ అద్వానీలా కల సాకారం చేయాలన్నా,ఈ దేశాన్ని అఖండ భారతంగా తీర్చిదిద్దలన్నా కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పని చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.