Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 06 సంగారెడ్డి జిల్లా

పటాన్ చేరు పట్టణ పరిధిలో గల రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయాల్లో చలువ పందిర్లు వేసి శ్రీ కోదండ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా పటాన్ చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యం లో నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారామ కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణానికి పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తమున భాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి కళ్యాణ అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమo లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కోదండ సీతారామ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.