Listen to this article

పీఎం దామరగిద్ద నుంచి తడ్కల్ హనుమాన్ మందిరం వరకు హనుమాన్ స్వాముల బైక్ ర్యాలీ,

జనం న్యూస్, ఏప్రిల్ 06,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద, గ్రామానికి చెందిన హనుమాన్ స్వాములు శ్రీరామనవమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు,ఎస్ఐ విజయ్ కుమార్, మాట్లాడుతూ “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే!” “ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం!”
“లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్!” సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం,లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కళంకమైన సోదర ప్రేమ, హనుమంతుని అచంచలమైన భక్తి, దశరథరాముల మధ్య కనిపించే తండ్రీకుమారుల ప్రేమ మనందరికీ ఆదర్శం. అని అన్నారు.ధర్మం, నీతి మార్గం, శ్రీరామచంద్రుడి జీవితం సకల మానవాళికి ఆదర్శం,అని అన్నారు. ఆ దివ్యమైన బంధాలు మన జీవితంలోనూ ప్రతిఫలించాలని అన్నారు.దేవుళ్లందరికీ పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ సీతారాముల కల్యాణవైభోగమే వైభోగం! రాముడు మనుషుల్లో దేవుడు.ఆయనంటే వల్లమాలిన ఇష్టం..వల్లమాలిన నమ్మకం.ఇంటిల్లిపాదికి, పరివారానికి,ప్రజలకి రాముడంటే నమ్మకంతో కూడిన భక్తి.ఒక మహత్కార్యం కోసం సాక్షాత్ శ్రీమహాలక్ష్మి రాముడి అర్థాంగిగా భువిపై అవతరించింది. అందుకే కొందరు మహనీయులు ‘నను బ్రోవమని చెప్పవే..’ అంటూ సీతమ్మ తల్లితో మొర పెట్టుకునే వారు.సీతారాములు మానవజాతికి ఆదర్శప్రాయమైన జంటగా నిలిచారు. రాముడు రుజువర్తనుడు. కష్టాలను కష్టాలుగానే అనుభవించాడు. రాజీపడి ధర్మాన్ని అణువంతైనా వీడి చరించలేదు.జనస్థానంలో రాక్షస మూకల్ని చీల్చి చెండాడి క్షాళన చేశాడు.చివరకు సముద్రం దాటి లంకకు వెళ్లి రావణ సంహారం చేసి సీతమ్మని తిరిగి పొందాడు.రామకథ విశ్వవ్యాప్తి చెందింది. అన్ని దేశాల్లో చాలా భాషల్లో రామకథలు వచ్చాయి.నాలుగు వందలకు పైగా రామాయణాలు అదే మూలకథతో ప్రపంచ భాషలకు ఎక్కాయి. మన హైందవ వివాహ సంస్కృతికి చెదరని పునాదిగా రామకథ నిలిచింది.ఇది సత్యం. అని అన్నారు.