

జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన యువతి అఖిలను చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల కోలుకుంటోందని కిమిడి కళా వెంకట్రావు చెప్పారు.ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. ప్రశాంతంగా ఉండే చీపురుపల్లి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.